Kingdom

Kingdom: కింగ్డమ్ హిందీ వెర్షన్ విషయంలో షాకింగ్ ట్విస్ట్?

Kingdom: టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రం “కింగ్డమ్”. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం జూలై 31న విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ విడుదల ప్రకటనతో అనూహ్య మలుపు వెలుగులోకి వచ్చింది. “కింగ్డమ్” తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది, కానీ హిందీ వెర్షన్ నేరుగా ఓటీటీలోకి వెళ్లనుంది.

Also Read: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

మొదట హిందీలో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ, ఆలస్యం కావడం, నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హిందీ ప్రేక్షకులు థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే ఈ చిత్రాన్ని చూడనున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ సినిమా భారీ వినోదాన్ని అందించనుందని, గౌతమ్ తిన్ననూరి మార్క్ దర్శకత్వం అద్భుతంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. జూలై 31న థియేటర్లలో, హిందీలో ఓటీటీలో “కింగ్డమ్” రాజ్యమేలనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  India Pakistan Tension: భారత పైలట్ ఎవరూ మా అదుపులో లేరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *