Salaar Re-release: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్”. అయితే ఈ చిత్రం ఓటిటిలో మరింత కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక లేటెస్ట్ గా మళ్ళీ థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాకి ఓ వారం ముందే బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ మళ్ళీ విధ్వంసం సృష్టిస్తుంది.
Also Read: Ramayana: బాలీవుడ్ రామాయణంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
Salaar Re-release: ఈ మధ్య కాలంలో వచ్చిన స్టార్ హీరోస్ రీరిలీజ్ లలో హవర్లీ బుకింగ్స్ పరంగా సలార్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇది కూడా కేవలం కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసిన దానికే వచ్చిన రెస్పాన్స్ కావడం గమనార్హం. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ ఓపెన్ అయితే బుక్ మై షోలో కొత్త రికార్డులు నమోదు కావొచ్చనే చెప్పాలి. ఇక ఈ రీరిలీజ్ లో సలార్ వసూళ్లు ఏ మేర వస్తాయో చూడాలి.

