Eluru: సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వివాహితకు అత్తింట్లో ఎదురైన దారుణ వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తూ అత్తమామలు, తోడికోడలు సదరు మహిళను చిత్రహింసలకు గురిచేశారు. రెండేళ్ల క్రితం రంజిత్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఈ మహిళకు ఒక ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. అయితే, ఆమె అత్తమామలు, తోడికోడలు కలిసి ఆమెపై భర్త సోదరుడి (బావ)తో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని, తద్వారా అతనికి కూడా వారసుడిని కనాలని దారుణంగా ఒత్తిడి చేశారు.
వివాహిత ఈ అమానుష డిమాండ్‌ను గట్టిగా తిరస్కరించడంతో, ఆగ్రహించిన అత్తింటివారు ఆమెను, ఆమె ఏడాది కొడుకును దాదాపు 10 రోజుల పాటు గదిలో నిర్బంధించారు. ఆ గదికి కరెంట్, మరుగుదొడ్డి, త్రాగునీరు, ఆహారం వంటి కనీస సదుపాయాలు లేకుండా చేసి, అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా ఆమె భర్త మాత్రం మౌనంగా ఉండటం విస్మయం కలిగించింది.
Also Read: Cm chandrababu: అనుకున్న టైంకి పని అయిపోవాలి
ఈ దారుణం గురించి హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ చైర్ పర్సన్ మండెం లక్ష్మితో పాటు మానవహక్కుల సంఘాల నేతలకు, మహిళా సంఘాలకు సమాచారం అందింది. బాధితురాలికి మద్దతుగా మహిళా సంఘాలు ఆ ఇంటి ముందు టెంట్ వేసి నిరసనకు దిగాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలాానికి చేరుకున్నారు. మహిళను, ఆమె కొడుకును నిర్బంధం నుంచి విడుదల చేసి రక్షించారు. అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.


