Airport

Airport: విమానాశ్రయంలో షాకింగ్ ఘటన.. ప్రయాణికుడి బ్యాగ్ ఓపెన్ చేయగా!?

Airport: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శంషాబాద్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు మరోసారి స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. గురువారం రాత్రి బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడి వద్ద 3.6 కిలోల హైడ్రోఫోనిక్ వీడ్‌ (గంజాయి) స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం ప్రకారం, గురువారం రాత్రి 9:30 గంటలకు బ్యాంకాక్‌ నుంచి 6E-1068 విమానంలో వచ్చిన అబ్దుల్ ఖాదర్ S (పాస్‌పోర్టు నంబర్: U2092815) ను అధికారులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని చెక్-ఇన్ బ్యాగేజీని తనిఖీ చేయగా, అందులో నిషిద్ధ మత్తు పదార్థం దొరికింది.

ఇది కూడా చదవండి: Kishan Reddy: కొట్టుకుపోయిన హైదరాబాద్–శ్రీశైలం హైవే.. నేడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన

సుమారు 3.6 కిలోల హైడ్రోఫోనిక్ వీడ్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు దాని విలువను రూ. 3.60 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న సరుకు, నిందితుడు ఇద్దరూ AIU బృందం కస్టడీలో ఉన్నారు.

అధికారులు తెలిపినట్లుగా, నిందితుడిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో మరోసారి అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *