Allu Arjun-Atlee

Allu Arjun-Atlee: అల్లు అర్జున్ – అట్లీ సినిమా గ్రాఫిక్స్ కోసం షాకింగ్ బడ్జెట్!

Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సంచలన దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్-ఇండియా చిత్రం సినీ ప్రపంచంలో సందడి చేస్తోంది. ఈ చిత్రం కేవలం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం 350-400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో, అత్యాధునిక సాంకేతికతతో ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించనుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకొణెతో పాటు మరికొందరు నటించనున్నట్లు టాక్. అట్లీ ఈ సినిమా ద్వారా సైన్స్ ఫిక్షన్, యాక్షన్ జానర్‌లో ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu: మీరంతా ఏమి చేస్తున్నారు? టీటీడీ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం! ఈరోజు తిరుపతికి సీఎం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *