Nithin

Nithin: నితిన్ కెరీర్‌కు షాక్.. కోట్లలో నష్టం?

Nithin: నితిన్ కెరీర్‌లో వైఫల్యాలు కొత్త కాదు, కానీ ఈసారి నష్టం ఊహించనంత భారీగా ఉంది. రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూ.70 కోట్లతో తెరకెక్కిన రాబిన్ హుడ్, విదేశీ షెడ్యూల్స్, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. అలాగే, వేణు శ్రీరాం రూపొందించిన తమ్ముడు కూడా దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో వచ్చింది. కానీ, రెండు చిత్రాలు కలిపి కేవలం రూ.11 కోట్ల షేర్ మాత్రమే రాబట్టాయి. రాబిన్ హుడ్ రూ.7 కోట్లు, తమ్ముడు రూ.5 కోట్ల లోపే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బలహీనమైన కథ, స్క్రీన్‌ప్లే వల్ల ఈ చిత్రాలు నిరాశపరిచాయి. రూ.145 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ డిజాస్టర్లు నితిన్ కెరీర్‌లో అతిపెద్ద నష్టంగా నిలిచింది. ఇకపై కథల ఎంపికలో జాగ్రత్త అవసరమని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న ఎల్లమ్మ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. బడ్జెట్‌ను నియంత్రించి సేఫ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నితిన్‌కు హిట్‌ను అందిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *