Pushpa-2

Pushpa-2: ‘పుష్ప-2’ బుల్లితెర టెలికాస్ట్: టీఆర్పీ రేటింగ్‌లో షాక్!

 Pushpa-2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా వరల్డ్‌వైడ్‌గా సంచలన విజయం సాధించి, ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేసింది. బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ, రష్మిక మందన్న హీరోయిన్‌గా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

అయితే, తాజాగా బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్ షోగా టెలికాస్ట్ అయిన ‘పుష్ప-2’ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి కేవలం 12.6 టీఆర్పీ రేటింగ్ మాత్రమే దక్కింది. గతంలో బన్నీ చిత్రాలు ‘అల వైకుంఠపురములో’ (29.4), ‘పుష్ప ది రైజ్’ (22.5) రికార్డు రేటింగ్స్ సాధించాయి.

Also Read: Akhanda 2: అఖండ 2: ఆ వార్తలన్నీ ఫేక్.. అస్సలు తగ్గేదేలే!

 Pushpa-2: దీంతో ‘పుష్ప-2’ కూడా బుల్లితెరపై సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అందరూ భావించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు చేసిన ఈ చిత్రానికి టీఆర్పీ రేటింగ్ ఇలా రావడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ రేటింగ్ ఎందుకు తగ్గింది? అనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nandamuri Suhasini: రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ..? క్లారీటీ ఇచ్చిన సుహాసిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *