Khaleja: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళితో తన భారీ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ గ్యాప్‌లో మహేష్ అభిమానులు తమ హీరో పాత చిత్రాల రీ-రిలీజ్‌లతో జోష్‌లో ఉన్నారు. అలాంటి సినిమాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖలేజా’కు కల్ట్ ఫాలోయింగ్ ఉంది.
ఈ సినిమా రీ-రిలీజ్ కోసం ఫ్యాన్స్‌లో భారీ హైప్ నెలకొంది. మే 30న థియేటర్లలో ‘ఖలేజా’ సందడి చేయనుందని అంతా భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ‘ఖలేజా’ రీ-రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ వాయిదాకు గల కారణాలు ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు.
Also Read: Ram Charan: లండన్‌లో గ్లోబల్ స్టార్: మేడమ్ టుస్సాడ్స్‌లో వాక్స్ స్టాచ్యూ లాంచ్ కి రెడీ!
Khaleja: మే 30న థియేటర్లలో సినిమా ఆగిపోయినట్లు సమాచారం. ఈ వార్త మహేష్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించింది. కొత్త రిలీజ్ తేదీ ఎప్పుడనేది త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి, ‘ఖలేజా’ మళ్లీ థియేటర్లలో ఎప్పుడు సందడి చేస్తుందో వేచి చూడాలి!