Chiranjeevi-Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తూ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. తాజాగా సీనియర్ నటి శోభన, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయ. ప్రస్తుతం వైజాగ్‌లో అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. చిరంజీవి పాత్రకు ప్రత్యేకమైన యాస, బాడీ లాంగ్వేజ్‌ను డిజైన్ చేస్తూ కామెడీపై పూర్తి ఫోకస్ పెట్టారు.
చిరంజీవి ఈ సినిమాపై ఇటీవల మాట్లాడుతూ, “అనిల్ చెప్పే సీన్స్‌కు కడుపుబ్బా నవ్వుతున్నా. ఈ చిత్రం అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది,” అని హామీ ఇచ్చారు. సెట్స్‌పై అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు!