Shivraj Kumar: కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కన్నడ భాషపై వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్‌లో కమల్, కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని చెప్పడం కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ఈవెంట్‌లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఉన్నప్పటికీ, కమల్ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై శివరాజ్ కుమార్ స్పష్టతనిచ్చారు.
Also Read: Prabhas: డిసెంబర్ కి వెళ్లిపోయిన రాజా సాబ్.. ప్రభాస్ కొత్త పోస్టర్ అదిరిపోయిందిగా..
Shivraj Kumar: “నేను కమల్ వ్యాఖ్యల సమయంలో చప్పట్లు కొట్టలేదు. అది ఎడిటింగ్ లోపం వల్ల తప్పుగా చూపించారు. వేరే స్పీచ్‌కు చప్పట్లు కొట్టాను,” అని శివరాజ్ తెలిపారు. కన్నడ భాషపై తనకు అపారమైన గౌరవం ఉందని, అది తన మాతృభాష అని గర్వంగా చెప్పారు. “కన్నడ కోసం నా ప్రాణమైనా ఇస్తా. కమల్ సీనియర్ నటుడు, ఆయనపై నాకు గౌరవం ఉంది. కానీ, భాషా విషయంలో నా స్థానం స్పష్టం,” అని శివరాజ్ పేర్కొన్నారు.