Surya – Karthi: మైత్రీ మూవీమేకర్స్ సంస్థ తమిళంలో మల్టీ స్టారర్ కి సన్నాహాలు చేస్తోంది. ‘నిన్ను కోరి, మజిలీ, ఖుషీ’ చిత్రాల దర్శకుడు శివనిర్వాణ దానికి తగ్గ కథను సిద్ధం చేశాడట. శివ చెప్పిన లైన్ నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ రెడి చేయమన్నారట. తమిళ స్టార్ హీరోలు, అన్నదమ్ములైన సూర్య, కార్తీకి సరిపోయే కథ కావటంతో వారిని సంప్రదించారట. మైత్రీ మూవీస్ వారు గతంలోనే సూర్యకు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. త్వరలోనే శివ నిర్వాణ బ్రదర్స్ ఇద్దరినీ కలసి కథను చెప్పబోతున్నాడట.
ఇది కూడా చదవండి: Kubera: ‘కుబేర’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..
సూర్య నటించిన ‘కంగువ’ ఈ నెల 14న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి కావచ్చింది. టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మరో వైపు కార్తీ ‘సర్దార్2’ షూటింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరూ కలసి ‘చినబాబు’లో ఓ సీన్ లో కనిపిస్తేనే థియేటర్లు దద్దరియ్యాలి. ఇక పుల్ లెంగ్త్ సినిమా చేస్తే అంతే సంగతులు. అ నేపథ్యంలో శివ నిర్వాణ వీరిద్దరినీ ఒప్పిస్తే ఫ్యాన్స్ కు పండగే. చూడాలి మరి ఏం జరుగుతుందో..