Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలు విద్యా రంగంలో కొత్త మార్పులు తెచ్చే కేంద్రాలవ్వాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కల్యాణి కుమారి కి సత్కారం
జేఎం తండాలో ఉన్న ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఎం. కల్యాణి కుమారి అద్భుత ఫలితాలు సాధించారు. 2017లో బదిలీ అయిన ఆమె, ఆ పాఠశాల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చారు. పిల్లలకు బోధనలో కొత్త పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణలతో విద్యార్ధులను అభివృద్ధి చేయడంలో విశేషంగా రాణించారు.
ఇది కూడా చదవండి: Bali Sea Tragedy: ఇండోనేషియాలో ఫెర్రీ ప్రమాదం.. నలుగురు మృతి.. 38 మంది గల్లంతు
ఈ కృషిని గుర్తించి ‘షైనింగ్ టీచర్’ గా మంత్రి లోకేశ్ ఆమెను ఘనంగా సత్కరించారు. ఆమె కుటుంబంతో కలిసి మంత్రి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు పొందారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై ఉపాధ్యాయుల నుంచి మంచి సూచనలు తీసుకుని, ప్రభుత్వ పాఠశాలల్లో వాటిని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
కల్యాణి కుమారి మాట్లాడుతూ, మంత్రి నుండి ఈ గౌరవం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.

