Shilpa Shirodkar: ఒకప్పటి సినీ తార శిల్పా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత చెల్లెలైన శిల్పా, తెలుగులో ‘బ్రహ్మ’ సినిమాతో పాటు పలు చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ శిల్పా, 2010 తర్వాత ఇండియాకు తిరిగొచ్చారు. సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వచ్చినా, ఆమె ఆ ఊహాగానాలను తోసిపుచ్చారు. తల్లిదండ్రుల మరణంతో జీవితం తలకిందులైందని, ఆ బాధ నుంచి కోలుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లానని, జీవితం మీద విరక్తి పుట్టిందని శిల్పా బాంబ్ పేల్చారు. ఆ సమయంలో కుటుంబంతో సరిగా మాట్లాడలేక, కోపంతో కూతురిపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయని వెల్లడించారు. అక్క నమ్రతకు దగ్గరగా ఉండాలనే ఆలోచనతోనే ఇండియాకు వచ్చానని, సినిమా రీఎంట్రీ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఇలా తన భర్త ఉద్యోగం, కూతురి స్కూల్‌ను వదిలి ఇండియాకు రావడం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటో ఆమె వివరించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.
