Shilpa Shetty: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో వీరు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఒక వ్యాపారం విషయంలో జరిగిన ఒప్పందంలో శిల్పా–రాజ్‌లు ఒక వ్యాపారవేత్తను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. వీరు తరచూ విదేశాలకు వెళ్లి వస్తున్నారన్న ట్రావెల్ హిస్టరీ ఆధారంగా, విచారణ సమయంలో దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గత ఆగస్టు 14న జుహూ పోలీస్ స్టేషన్లో వీరి మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 2015 నుంచి 2023 మధ్య వ్యాపార విస్తరణ పేరిట రూ.60 కోట్లు తీసుకున్న ఈ జంట, ఆ డబ్బును తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు ఆరోపించారు.