Sharwanand: శ్రీను వైట్ల – శర్వానంద్ కాంబోలో కొత్త చిత్రం రెడీ అవుతోంది. ఈ సినిమాలో మ్యాడ్, 8 వసంతాలు బ్యూటీ అనంతికను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. వరుస ప్లాపులు తరువాత గోపి చంద్ తో విశ్వం సినిమా తీశారు శ్రీనువైట్ల. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వలేదు కానీ, యావరేజ్ గా నిలిచింది. అయినా శ్రీను వైట్ల వెనకడుగు వెయ్యకుండా, మళ్లీ హిట్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Yellamma: ఎల్లమ్మపై దిల్ రాజు క్లారిటీ!
ఈ క్రమంలో శర్వానంద్‌తో కొత్త చిత్రం ప్రకటించారు. మ్యాడ్, 8 వసంతాలు చిత్రాలతో ఆకట్టుకున్న అనంతిక సనీల్ కుమార్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రం యంగ్ ఏజ్‌లో ఆవేశంతో చేసిన తప్పు వల్ల జీవితంలో ఎదురయ్యే డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం శర్వానంద్ మరో కొత్త లుక్ లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో సీనియర్ హీరో కూడా కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. ఈ నెల చివరి నాటికి ఈ చిత్రం అధికారికంగా సెట్స్ మీదకు వెళ్తుంది.

