Shamshabad Airport:

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఆల‌స్యం.. కుంభ‌మేళా భ‌క్తుల‌కు ఆటంకం

Shamshabad Airport: మ‌హాకుంభ‌మేళాలో చివ‌రి రోజు పుణ్య‌స్నానాలు ఆచ‌రించాల‌ని వారంతా కోరుకున్నారు. ఆ మేర‌కు ముంద‌స్తుగానే విమానం టికెట్ల‌ను బుక్ చేసుకున్నారు. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం కూడా క‌లిసి రావ‌డంతో ఆనందంతో వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 26)న శంషాబాద్ విమానాశ్ర‌యానికి వెళ్తే విమానం ఆల‌స్యంతో వారు వెళ్లేందుకు ఆట‌కం ఏర్ప‌డింది.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు స్పైస్‌జెట్ విమానం టికెట్లు బుక్ చేసుకున్న వారంతా చేరుకున్నారు. ఆ విమానం సాంకేతిక‌లోపంతో మూడు గంట‌లు ఆల‌స్య‌మ‌వుతుంద‌ని తేల్చి చెప్ప‌డంతో ఉసూర‌మ‌న్నారు. దీంతో ప్ర‌యాణికులంతా అధికారుల‌తో వాగ్వాదానికి దిగారు. తీవ్ర నిర‌స‌న తెలిపారు. విమాన సంస్థకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ విమానాశ్ర‌యంలోనే ఆందోళ‌న చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: మ‌లుపులు తిరుగుతున్న మీర్‌పేట మ‌హిళ హ‌త్యోదంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *