Shahid Afridi: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ ఔటైన వివాదంపై మాజీ పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్రంగా స్పందించారు. ఈ ఔట్‌పై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన విమర్శిస్తూ, ఒక వ్యంగ్య వ్యాఖ్య చేశారు. పాకిస్తానీ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ, ఫఖర్ జమాన్ క్యాచ్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫఖర్ జమాన్‌ను ఔట్‌గా ప్రకటించడంపై ఆయన నవ్వుతూ “అతను ఐపీఎల్‌లో కూడా అంపైరింగ్ చేయాలి కదా” అని అన్నారు.
ఈ కామెంట్స్ ద్వారా, అఫ్రిది అంపైర్ భారత్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని పరోక్షంగా ఆరోపించారు. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారడానికి గల కారణం, బంతి వికెట్ కీపర్ సంజు శాంసన్ గ్లౌవ్స్‌లోకి వెళ్లడానికి ముందు నేలను తాకిందా లేదా అనే సందేహం. రీప్లేలో బంతి నేలకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించింది. అయితే, థర్డ్ అంపైర్ దానిని “క్లీన్ క్యాచ్”గా నిర్ధారించి ఫఖర్ జమాన్‌ను ఔట్‌గా ప్రకటించారు.ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ఇది కూడా చదవండి: Shreyas Iyer: ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్.. శ్రేయాస్ అయ్యర్ ఔట్
26 కెమెరాలు ఉన్నప్పటికీ, థర్డ్ అంపైర్ కేవలం రెండు యాంగిల్స్‌నే చూసి నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేశారు. బంతి నేలను తాకినట్లు తనకు అనిపించిందని, అయితే అంపైర్లు తప్పులు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.