Shah Rukh Khan: సినిమాల్లో నటన, సినిమాల నిర్మాణంలోనే కాకుండా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఇండియాలో రిచెస్ట్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు షారూఖ్ ఖాన్. ఐపిఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ ఓనర్ గానే ఇటీవల స్కాచ్ విస్కీ తయారీ పరిశ్రమలోనూ పెట్టుబడి పెట్టాడు షారూఖ్. అంతే కాదు ఈ విస్కీ వ్యాపారంలో ప్రపంచ స్థాయి గుర్తింపు ను కూడా పొందాడు. షారూఖ్ అతని తనయుడు ఆర్యన్ ఖాన్ విస్కీ బ్రాండ్ ‘డియావోల్’ 2024 న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్ లో ‘వరల్డ్ బెస్ట్ స్కాచ్ విస్కీ’ బిరుదును సంపాదించింది. ది టేస్టింగ్ అలయన్స్ హోస్ట్ చేసిన న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్ లో ప్యానెల్ ‘డియావోల్’ అత్యుత్తమమైనదని దృవీకరించింది.
Shah Rukh Khan: షారూఖ్ ఖాన్ మాత్రమే కాదు సంజయ్ దత్ కూడా దాదాపు రూ 1000 కోట్లను మద్యం వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్న ఆల్కాహాల్ మార్కెట్స్ లో ఇండియా ఒకటి. స్కాచ్ విస్కీ అసోసియేషన్ డేటా ప్రకారం యుకె అతి పెద్ద స్కాచ్ విస్కీ మార్కెట్. ఇప్పుడు ఇండియా ఫ్రాన్స్ ను అధిగమించింది. 2022తో పోలిస్తే 2023లో ఇండియాలోవ విస్కీ వాడకం 60 శాతం పెరిగిందట. మరి ఈ పెరుగుదల షారూఖ్, సంజయ్ దత్ కు ఏ మేరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.

