Shah Rukh Khan: గత యేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మూడు సినిమాలు చేస్తే అందులో రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ‘డింకీ’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక వచ్చే యేడాది అతను నటించిన ‘కింగ్’ వస్తుందని భావిస్తున్నారు కానీ అది 2026కి వాయిదా పడేలా ఉంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 20న విడుదల కాబోతున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ మూవీలో ముఫాసా కు షారుక్ వాయిస్ ఇచ్చాడు. సింబాకు అతని కొడుకు ఆర్యన్ ఖాన్ గొంతు అరువిచ్చాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… తాజాగా న్యూ ఢిల్లీలో షారుక్ ఓ ప్రైవేట్ పార్టీ పాల్గొన్నాడు. అక్కడ స్టేజీపై అతను వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘దిల్ సే’ మూవీలో ‘ఛయ్య… ఛయ్యా…’ పాటకు, తాజా చిత్రం ‘జవాన్’లోని పాటకు స్టేజ్ మీద డాన్సర్స్ తో కలిసి స్టెప్పులేశాడు షారుఖ్ ఖాన్. అంతేకాదు… నయా మేకోవర్ తో షారుక్ అక్కడి వారందరినీ మెస్మరైజ్ చేశాడు కూడా!
@JacyKhan rn pic.twitter.com/YyywDWSkOD
— Jacy Rukh Khan_ (@_ShahKi_Biwi_) December 5, 2024