Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరోసారి తన హవాను చాటుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఎస్క్వైర్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 10 ధనిక నటుల జాబితాలో షారుఖ్ 4వ స్థానంలో నిలిచారు. రూ. 7,400 కోట్ల (సుమారు $876.5 మిలియన్) సంపదతో బ్రాడ్ పిట్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డి నీరో వంటి హాలీవుడ్ దిగ్గజాలను వెనక్కి నెట్టారు.
షారుఖ్ సంపద వెనుక ఆయన సినీ కెరీర్‌తో పాటు వ్యాపార తెలివి ఉంది. 2023లో ‘జవాన్’, ‘పఠాన్’ వంటి రూ. 2,000 కోట్లు వసూలు చేసిన బ్లాక్‌బస్టర్‌లు, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్, కోల్‌కతా నైట్ రైడర్స్ క్రికెట్ టీమ్ యాజమాన్యం, అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఆయన సంపదను పెంచాయి. 30 ఏళ్లుగా బాలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉన్న షారుఖ్, ఈ జాబితాలో ఏకైక భారతీయ నటుడిగా సత్తా చాటారు. టామ్ క్రూయిస్ ($891 మిలియన్), డ్వేన్ జాన్సన్ ($1.19 బిలియన్), ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ ($1.49 బిలియన్) తర్వాత స్థానం సంపాదించిన షారుఖ్, భారత సినిమా గ్లోబల్ రీచ్‌ను నిరూపించారు.
