Shah Rukh Khan: సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. మొబైల్‌లో బెదిరింపు రావడంతో షారుక్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు రావడంతో షారుక్ ఇంటి మన్నాత్ బయట భద్రతను పెంచారు.
భారతీయ శిక్షాస్మృతి (BNS) సెక్షన్లు 308 (4), 351 (3)(4) కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫైజాన్ అనే వ్యక్తి పేరు మీద బెదిరింపు మెసేజ్ వచ్చిన మొబైల్ నంబరు నమోదైంది. నంబర్‌ను గుర్తించిన వెంటనే ముంబై పోలీసులు రాయ్‌పూర్‌కు చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: Mechanic Rocky: ఐ హేట్ యూ మై డాడీ అంటున్న ‘మెకానిక్ రాకీ’
Shah Rukh Khan: డిసిపి తెలిపిన వివరాల ప్రకారం, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది. బ్యాండ్ స్టాండ్‌లోని షారుక్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి చెప్పాడు. 50 లక్షలు ఇవ్వకపోతే షారుక్ ఖాన్‌ని చంపేస్తాను అని బెదిరించిన ఆ వ్యక్తిని పేరు అడిగితె నా పేరు హిందుస్తానీ అని చెప్పాడు.
2023 సంవత్సరంలో కూడా, పఠాన్, జవాన్ చిత్రాల విజయం తర్వాత షారుక్ ఖాన్‌కు వరుసగా బెదిరింపులు వచ్చాయి. ఫిర్యాదు నమోదు కాగానే భద్రతా కారణాల దృష్ట్యా అతనికి వై ప్లస్ భద్రత కల్పించారు. అప్పటి నుంచి షారుక్ ఖాన్ కు అన్ని చోట్లా కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు.