cold wave

Cold Wave: ఉత్తర భారతంలో చలిగాలుల రికార్డ్

Cold Wave: చలిగాలుల కారణంగా దేశంలోని 8 రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాజస్థాన్‌లోని కరౌలీలో ఉష్ణోగ్రత 1.3 డిగ్రీలకు చేరుకుంది. సికార్‌, ఉదయ్‌పూర్‌ సహా పలు ప్రాంతాల్లో వాహనాలపై మంచు పేరుకుపోయింది. కోల్డ్ వేవ్స్ ఇక్కడ మరో  4-5 రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. 

మరోవైపు పంజాబ్‌లోనూ చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఫరీద్‌కోట్‌లో తొలిసారిగా రాత్రి ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు చేరుకుంది. అబోహర్‌లో ఉష్ణోగ్రత  0.9 డిగ్రీలుగా నమోదు అయింది.  పంజాబ్‌లో సగటు పగటి ఉష్ణోగ్రత అర డిగ్రీకి పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Priyanka Gandhi: రోజుకొక బ్యాగ్ తో పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ సంచలనం!

Cold Wave: చలిగాలుల కారణంగా జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత  మైనస్‌ కంటే దిగువకు పడిపోతోంది. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సుతోపాటు పలు రిజర్వాయర్లు గడ్డకట్టడం ప్రారంభించాయి. బారాముల్లా జిల్లాలోని తంగ్‌మార్గ్‌లో 30 మీటర్ల ఎత్తున్న డ్రాంగ్ జలపాతం చలి కారణంగా గడ్డకట్టింది.

కాశ్మీర్‌లోని శ్రీనగర్, గుల్‌మార్గ్ వంటి దేశంలోని 35 అత్యంత శీతల నగరాల్లో మధ్యప్రదేశ్‌లోని 10 నగరాలు కూడా ఉన్నాయి. వీటిలో పచ్‌మరి 11వ స్థానంలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత 1.6 డిగ్రీలకు చేరుకుంది.

భోపాల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలుగా నమోదైంది. చలిగాలులు వరుసగా నాలుగో రోజు ఇక్కడ కొనసాగాయి, ఇది కొత్త రికార్డు. గతంలో  ఎప్పుడూ కూడా  డిసెంబర్‌లో వరుసగా 4 రోజుల పాటు చలిగాలులు వీచడం జరగలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *