Road Accident

Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: దైవ దర్శనానికి వెళ్లి …అనంతలోకాలకు వెళ్లిపోయారు. కారణం ఏదైనా ..మరణం మాత్రం అందరిని వెంబడించింది. దేవుడి దయతో ఇక్కడికి వచ్చాము. అదే దయతో దర్శనం తర్వాత ఇంటికి వెళ్ళాలి అనుకున్న ఆ భక్తులకు మృత్యువు వాహన రూపంలో వెంబడించింది. విషాదం ఏంటంటే ..మృతి చెందిన అందరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు

మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా త్రివేణి సంగమంలో స్నానం చేసి మినీ బస్‌ లో ఇంటికి తిరిగి వస్తుండగా.. మంగళవారం ఉదయం జబల్‌పుర్‌ జిల్లా పరిధిలోని షిహోరా ప్రాంతంలో మినీ బస్‌ ను ట్రక్‌ ఢీకొంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లాలోఈ ఘటన జరిగింది.

ఈ విషయాన్ని జబల్‌పుర్‌ జిల్లా కలెక్టర్‌ దీపక్‌ కుమార్‌ సక్సేనా వెల్లడించారు. ఏడుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరిని మంజు శర్మ, మనోజ్ విశ్వకర్మగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Also Read: Zero click hacking: వాట్సాప్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. జీరో – క్లిక్ హ్యాకింగ్ తో దబిడి దిబిడే.. జర భద్రం!

మహా కుంభమేళా నుండి తిరిగి వచ్చే భక్తులు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం ఇదే మొదటిది కాదు.మహా కుంభమేళా నుండి తిరిగి వస్తుండగా ఆగ్రాకు చెందిన దంపతుల కారును ట్రక్కును ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో కూడా ఒక ప్రమాదం జరిగింది, ఒడిశాలోని రూర్కెలాకు చెందిన ఒక వ్యక్తి కారు బస్సును ఢీకొట్టడంతో అతను మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటనలన్నీ మహా కుంభమేళా నుండి తిరిగి వచ్చే భక్తుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తాయి. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 9 వరకు 44 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించారు.

మరోవైపు కామారెడ్డి జిల్లాలో మహా కుంభమేళాకు వెళ్లి అస్వస్ధతకు గురై ఎల్లారెడ్డి వాసి మంగళి శంకర్ మృతి చెందాడు.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ఒకరు అస్వస్థతకు గురై మరణించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన శంకర్ కుంభమేళాకు వెళ్లి అస్వస్థతకు గురికాగా.. అతడిని అలహాబా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా స్పందించకపోవడంతో వెంటిలేటర్ వాహనంలో హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ALSO READ  Pawan Kalyan: పవర్ స్టార్ కొత్త అవతార్‌.. ట్రోల్స్ కి దిమ్మతిరిగే కౌంటర్!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *