Bharatheeyudu 3

Bharatheeyudu 3: భారతీయుడు 3 రిలీజ్‌పై సంచలన అప్‌డేట్!

Bharatheeyudu 3: కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన ఐకానిక్ చిత్రం భారతీయుడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గత ఏడాది విడుదలైన భారతీయుడు 2 మిశ్రమ స్పందన పొందినప్పటికీ, చివరిలో చూపించిన మూడో పార్ట్ టీజర్ అభిమానుల్లో హైప్ పెంచింది. ఈ సీక్వెల్‌ను థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని శంకర్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, భారతీయుడు 3 ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: Salaar 2: సలార్ 2 పై కొండంత హైపెక్కించిన పృథ్వీరాజ్!

కమల్ హాసన్ డబుల్ రోల్‌తో మరోసారి సమాజంలో అవినీతిపై పోరాడే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హై-ఆక్టేన్ యాక్షన్, శంకర్ మార్క్ విజువల్స్‌తో పాటు బలమైన సందేశం ఉంటుందని టాక్. రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిక్ సాగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *