Kubera

Kubera: ‘కుబేర’ సినిమాపై సంచలన అప్‌డేట్.. భారీ రన్‌టైంతో గ్రాండ్ రిలీజ్!

Kubera: జూన్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న భారీ చిత్రాల్లో ధనుష్, రష్మిక మందన్నా జంటగా, కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ‘కుబేర’ ఒకటి. దర్శకుడు శేఖర్ కమ్ముల మాయాజాలంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రన్‌టైం సుమారు 2 గంటల 50 నిమిషాలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు గంటల నిడివితో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ విజువల్ ట్రీట్‌గా నిలవనుందని సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని ఆసియన్ సునీల్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మించాయి. జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘కుబేర’ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *