Senier Citizens:డెబ్బై ఏళ్లు పైబడిన వయో వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సబంధమే లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా 70 ఏండ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం లభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ద్వారా రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందుతున్నది.
Senier Citizens:ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. కేంద్రంలో ఉన్న వృద్ధుల సంరక్షణలో భాగంగా ఉన్న ఈ పథకాన్ని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి టీ కృష్ణబాబు ఉత్తర్వులను జారీ చేశారు.
Senier Citizens:ఆధార్ కార్డుల్లో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ఆయుష్మాన్ యాప్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. అర్హత కలిగిన వారికి జిల్లాల్లో ప్రత్యేక కార్డులను అందజేస్తారు. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు సీఈవో ఈ పథకం అమలు విషయమై చొరవ తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

