Seethakka: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, చెరువులను కాపాడుకుందాం చెరువులకు బతుకమ్మకు అవినాభావ సంబంధం ఉంది చెరువులు నిండితేనే మన పంటలు పండుతాయి పంటలు పండుతేనే మనం పండుగ చేసుకోగలుగుతాం అందుకే అందరము చెరువులను కాపాడుకుందాం బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ వర్షాకాలం ముగుస్తున్న సమయంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటాం చెరువులకు పూజలు చేసే పండుగ బతుకమ్మ చప్పట్లతో ఆడుతూ గొంతేత్తి పాడటం వల్ల ఆనందం, ఆరోగ్యం కలుగుతాయి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చి పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుందాం పూలను పూజిస్తూ, చెరువులను ఆరాధిస్తూ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

