Allu Arjun: ‘పుష్ప’ సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఇక బన్నీ నటించిన ‘పుష్ప2’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో వేగం పెంచాడు. అందులో భాగంగా బుధవారం కేరళలో సందడి చేశాడు. ఈ సందర్భంగా కొచ్చిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కొచ్చిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయనకు పచ్చటి పొలల్లో ‘కేరళామ్ వెల్ కమ్స్ మల్లు అర్జున్’ అంటూ భారీ హోర్డింగ్ తో వెల్ కమ్ చెప్పారు. మధ్యాహ్నం నుంచే ఎయిర్ పోర్ట్ లో కాపు కాశారు. కొచ్చిన్ లోని లివా మాల్, గ్రాండ్ హయత్ లో ‘పుష్ప2’ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సైతం బన్నీ తన ఫ్యాన్స్ ఆర్మీగా మారింది కేరళ నుంచే అని స్పష్టం చేశాడు. ఇప్పడు బన్నీని కేరళ ఫ్యాన్స్ ‘మల్లు అర్జున్’గా ఓన్ చేసేసుకున్నారు. మరి ఇంతగా అభిమానిస్తున్న కేరళ ఫ్యాన్స్ 5వ తేదీన విడుదల కాబోతున్న ‘పుష్ప2’కు ఏ స్థాయి విజయాన్ని కట్టబెడతారో చూడాలి.
Kerala Allu Arjun fans waiting at kochi airport since afternoon 💥
Expecting @alluarjun arrival in 15mins #PushpaRulesKeralam
KOCHI WELCOMES ALLUARJUN pic.twitter.com/eNwfBwQ3k5— Allu Arjun Devotees 🐉 (@SSAADevotees) November 27, 2024