Gadchiroli Encounter: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి-నారాయణ్‌పూర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ మరణించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.గడ్చిరోలి పోలీసులు, ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మరణించిన నక్సల్స్‌లో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నక్సల్స్ గడ్చిరోలి డివిజన్ కమిటీకి చెందిన వారిగా గుర్తించారు.ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారనే పక్కా సమాచారం అందడంతో, ఉమ్మడి భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. నక్సల్స్ కాల్పులు జరపడంతో, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మరణించారు.
Also Read: Congress: జేడీఎస్ కు కాంగ్రెస్ బిగ్ షాక్…పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!
సంఘటన స్థలంలో మృతదేహాలతో పాటు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు మరియు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ ముగిసినప్పటికీ, ఆ ప్రాంతంలో మరే ఇతర నక్సల్స్ ఉన్నారేమోనని గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటన గడ్చిరోలిలో భద్రతా బలగాలకు లభించిన మరో విజయం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్‌కౌంటర్లు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైయ్యాడు. గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ముందు కూడా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించారు.

