Secundrabad: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి శాలీమర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈరైలు పట్టాలు తప్పింది. ఘటనపై లోకో పైలట్ రైల్వే సిబ్బందికి సంచారం ఇచ్చాడు. సమచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు.ఈ రైలోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సౌత్-ఈస్ట్రన్ రైల్వే అధికారులు వెల్లడించారు. కొందరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు.
పట్టాలు తప్పిన మూడు బోగీల్లో రెండు ప్రయాణికులకి కాగా.. ఒకటి పార్సిల్ వ్యాన్ అని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు బోగిలోని తొలగిస్తున్నారు అధికారులు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని రైల్వే పోలీసులు తెలిపారు.

