Secunderabad: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రధాన శాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
ప్రమాదం ఐదో అంతస్తులో ప్రారంభమై మంటలు వేగంగా వ్యాపించాయి. బ్యాంకులోని కీలకమైన పలు ఫైల్స్ మంటల్లో పూర్తిగా కాలిపోయినట్టు సమాచారం. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల అదుపుపై కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఫైర్ యూనిట్‌లు అక్కడ పనిచేస్తున్నాయి. బ్యాంకులో ఇంకా ఎవ్వరైనా ఉన్నారా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, నష్టం అంచనాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.