Secunderabad

Secunderabad: సంతాన భాగ్యం పేరుతో స్కామ్.. సికింద్రాబాద్‌ సృష్టి IVF సెంటర్‌పై కేసు!

Secunderabad: సికింద్రాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్’ అనే ప్రైవేట్ ఫెర్టిలిటీ క్లినిక్‌పై దారుణమైన మోసం ఆరోపణలు వెల్లువెత్తాయి. సంతానం కోసం ఆశతో ఆసుపత్రికి వెళ్ళిన ఒక దంపతులను ఆసుపత్రి యాజమాన్యం మోసం చేసిందని తెలుస్తోంది. మహిళ భర్త వీర్యకణాలు కాకుండా, వేరే వ్యక్తి వీర్యకణాలను ఉపయోగించి ఐవీఎఫ్ పద్ధతిలో పిండాన్ని అభివృద్ధి చేశారని ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంతానం కోసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దంపతులకు ఆసుపత్రి వ్యవహారశైలిపై అనుమానం కలిగింది. దీంతో వారు స్వచ్ఛందంగా డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల ఫలితాలు చూసి దంపతులు షాక్‌కు గురయ్యారు. కడుపులోని శిశువుకు మహిళ భర్తకు ఎటువంటి జన్యు సంబంధం లేదని డీఎన్‌ఏ రిపోర్ట్‌లో స్పష్టంగా తేలింది.

Also Read: Chamala Kiran: కేటీఆర్ ఏకపాత్రాభినయం చేస్తూ పగటి కలలు కంటున్నాడు 

పోలీసులకు ఫిర్యాదు, విచారణ ప్రారంభం:
ఈ సంచలన నిజం బయటపడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత దంపతులు వెంటనే నార్త్‌జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్’పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వైద్యుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: విశాఖలో జనసేన పార్టీ 'సేనతో సేనాని' సమావేశాలు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *