School Bus Accident: వారంతా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. పాటలు వింటూ.. పాడుకుంటూ.. బస్సులో వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బస్సులో వెళ్తున్న ఆ విద్యార్థులంతా ఇక కొద్దిసేపట్లో హైదరాబాద్ జలవిహార్‌ను చూస్తామని తలుచుకుంటూ ఉన్నారు. ఇంతలోనే ఒక్క ఉదుటన ఢాం అనే శబ్దం వారి ఆలోచనలను కల్లోలం చేసింది. వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఏంజరిగిందో తెలిసే లోపే పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. అప్పటిదాకా ఉత్సాహంగా ఉన్న తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
School Bus Accident: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రిషి స్కూల్‌కు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని జలవిహార్‌కు స్కూల్ బస్సులో విహారయాత్ర కోసమని డిసెంబర్ 25న బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ముందు ఉన్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. గాయాలపాలైన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
