SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టుల భర్తీకి కీలక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 2,964 ఖాళీల కోసం దరఖాస్తుల స్వీకరణను మళ్లీ ప్రారంభించింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల అభ్యర్థులు 10వ లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టుగా ఉన్న వారు ఈ అవకాశాన్ని పొందారు. జూన్ 21 నుంచి జూన్ 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు తీసుకుంటున్నారు.
మొత్తం 2,600 రెగ్యులర్ మరియు 364 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్న ఈ నియామకానికి బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. వివిధ కేటగిరీలకు వయోపరిమితి సడలింపులు ఉన్నాయి.
ఎంపికలో ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, భాషా ప్రావీణ్యం పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్ టెస్ట్‌లో 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 30 నిమిషాల డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. జీతం ₹48,480 ప్రారంభమవుతుంది. దరఖాస్తులు SBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాలి.