SBI

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఇతర బ్యాంకుల ఏటీఎం వాడితే ఇకపై బాదుడే!

SBI: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఏటీఎం లావాదేవీల చార్జీలను సవరించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడే కస్టమర్లపై ఈ భారం పడనుంది. సాధారణంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఇచ్చే ఐదు ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు కానీ, ఆ పరిమితి దాటిన తర్వాత చేసే విత్‌డ్రాయల్స్‌పై చార్జీలను ప్రభుత్వం పెంచింది.

పెరిగిన చార్జీల వివరాలు

ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆరోసారి నుండి డబ్బులు తీస్తే, ప్రతి లావాదేవీకి ఇప్పుడు రూ. 23 తో పాటు జీఎస్టీ (GST) చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ చార్జీ రూ. 21 గా ఉండేది. కేవలం డబ్బులు తీయడమే కాకుండా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం లేదా మినీ స్టేట్‌మెంట్ వంటి పనుల కోసం ఏటీఎంను వాడితే (ఆర్థికేతర లావాదేవీలు), గతంలో ఉన్న రూ. 10 చార్జీని ఇప్పుడు రూ. 11 కి పెంచారు. దీనికి కూడా జీఎస్టీ అదనంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: WPL 2026: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర

సాలరీ అకౌంట్ ఉన్నవారికి కూడా నిరాశే

ముఖ్యంగా సాలరీ అకౌంట్ (జీతపు ఖాతా) ఉన్న ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. గతంలో వీరికి ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు తీసుకునే అవకాశం ఉండేది. కానీ, గత నెల నుండే ఈ అపరిమిత సౌకర్యాన్ని తొలగించి, నెలకు కేవలం 10 ఉచిత లావాదేవీలకు మాత్రమే పరిమితం చేశారు. 10 సార్లు దాటిన తర్వాత వీరు కూడా పెరిగిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

ఎవరికి మినహాయింపు ఉంది?

అయితే, అందరికీ ఈ చార్జీలు వర్తించవు. ఎస్‌బీఐ ఏటీఎంలలో ఎస్‌బీఐ కార్డులు వాడే వారికి పాత పద్ధతే కొనసాగుతుంది. అలాగే, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా కలిగిన పేద వర్గాల కస్టమర్లకు కూడా పాత చార్జీలే వర్తిస్తాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలు ఎక్కువగా వాడే అలవాటు ఉన్నవారు ఈ కొత్త చార్జీలను గమనించి, తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *