Sayami Kher: ప్రముఖ నటి సయామీ ఖేర్ టాలీవుడ్‌లో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 2015లో ‘రేయ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సయామీ, బాలీవుడ్‌లో మిర్జియా, ఘూమర్ వంటి చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అవకాశాల కోసం ప్రయత్నించగా, ఆ సమయంలో ఒక మహిళా ఏజెంట్ తనను రాజీ పడాల్సిందిగా దర్శకుడు కోరినట్టు తెలిపింది.
అవకాశం కావాలంటే రాజీ పడాలని ఆమె సూచించింది. ఒక మహిళ ఇంకో మహిళతో ఈ మాట చెప్పడం ఆశ్చర్యపరిచిందని సయామీ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సాటి మహిళ అయ్యి ఉండి మరో మహిళతో అలా మాట్లాడటం సహించలేకపోయానని, తన లిమిట్స్ ఎప్పటికీ దాటనని సయామి ఆమె స్పష్టం చేసింది.
Also Read: RC17 : సుకుమార్ నుంచి మెగా అభిమానులకు క్రేజీ న్యూస్?
Sayami Kher: అయితే సయామీ ఖేర్ ఆ మహిళా కాస్టింగ్ ఏజెంట్ ఎవరో చెప్పలేదు. తనను కమిట్ మెంట్ అడిగిన దర్శకుడు ఎవరో కూడా వెల్లడించలేదు. ఆమె తనను రాజీ పడమని చెప్పిందని మాత్రమే అన్నారు. ప్రస్తుతం సయామి చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.