Save the Tigers 3: ఓటిటిలో సూపర్ హిట్ అయిన ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ సీజన్ 3 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా జియో హాట్‌స్టార్ ఫన్నీ గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య మళ్లీ గందరగోళం సృష్టించనున్నారు.
Also Read: Hrithik Roshan: ధురంధర్‌పై హృతిక్ వ్యాఖ్యలు వివాదం.. నెటిజన్ల ఫైర్!
వైవాహిక జీవితంలోని సరదా గొడవలు, అల్లరి ముచ్చట్లను సూపర్ టైమింగ్ కామెడీతో అలరించిన ‘Save the Tigers’ సిరీస్ సీజన్ 3తో మళ్లీ రానుంది. జియో హాట్‌స్టార్ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి ఘంటా రవి ఎమ్మెల్యే కావడం, రాజకీయ సటైర్ కూడా చేర్చడం విశేషం. గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్లో కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు, సమస్యలను మరింత ఫన్నీగా చూపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ మూడో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గత సీజన్లలో హైలైట్ గా నిలిచిన బిగ్ బాస్ ఫేమ్ జోర్ధార్ సుజాతాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆమె ఈ సిరీస్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్స్ గా నిలిచింది. తన మాటలు, చలాకి నటనతో యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సీజన్లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి మొదలైంది. ఈ సీజన్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు కానీ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సీజన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

