Satya Kumar: అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా

Satya Kumar ‘ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీను మరింత విస్తృతం చేస్తూ, అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తున్నామని. ఆయన విశాఖ కేజీహెచ్‌లోని CSR బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్, ₹40 కోట్ల విలువైన అత్యాధునిక రేడియేషన్ ఆంకాలజీ పరికరాలు మరియు సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ఎండోక్రైనాలజీ విభాగానికి చెందిన DEXA మెషిన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, కూటమి నాయకులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటివరకు 42 వేల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ ముప్పు తీవ్రతను గుర్తించి రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు చోట్ల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌లు ఏర్పాటు చేశామని, 2031 నాటికి ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

అలాగే, కేజీహెచ్ ఆసుపత్రిలో ₹45 కోట్లతో ఏర్పాటు చేసిన ఆధునిక ఆంకాలజీ పరికరాలు ద్వారా రోగులకు నాణ్యమైన క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రానున్నదని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ రహిత సమాజం వైపు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *