Saraswati Pushkaralu: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలలో దళిత ఎంపీకి అవమానం జరిగింది. పుష్కరాల ప్రారంభోత్సవంలో, సరస్వతీ మాత విగ్రహావిష్కరణలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపిస్తూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో కూడా ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో లేకపోవడంపై నిరసన వ్యక్తమైంది.
Saraswati Pushkaralu: సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొన్న పుష్కరాల ప్రారంభోత్సవం, విగ్రహావిష్కరణకు కావాలనే ఎంపీని పిలువలేదని ధ్వజమెత్తారు. దళితుడైనందునే వంశీకృష్ణను పిలువలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫ్లెక్సీలు పట్టుకొని నినాదాలు చేస్తూ వారంతా నిరసన వ్యక్తంచేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Saraswati Pushkaralu: స్థానిక ఎంపీ అయిన ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం, ఫ్లెక్సీలో ఫొటో పెట్టకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. వేరే ప్రాంతాలకు చెందిన సీఎం, మంత్రుల ఫొటోలు ఉండగా, స్థానిక ఎంపీ అయిన వంశీకృష్ణను విస్మరించడంపై దళిత వర్గాల నుంచే కాకుండా కంగ్రెస్ క్యాడర్ కూడా రగిలిపోతున్నది.