Sankranti 2025: రంగుల ముగ్గులతో లోగిళ్ళు.. డూ డూ బసవన్నల సందళ్ళు.. హరిదాసుల గోవింద నామ స్మరణలు.. సంక్రాంతి పండుగ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో సంబరంగా మొదలయిపోయాయి. ముచ్చటైన మూడు రోజుల పండుగల్లో తొలి పండుగ భోగి సందడి తెల్లవారు జామునే మొదలైంది. ప్రతి లోగిలిలో భోగి మంటలు వెలిగిపోతున్నాయి. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేదు.. సందడి మాత్రం ఒక్కటే. పల్లెల్లో ప్రతి వీధిలోనూ భోగిమంటల హడావుడి కనిపిస్తోంది. మరోవైపు పట్టణాల్లో అపార్ట్మెంట్స్.. గేటెడ్ కమ్యూనిటీల్లో భోగి మంటల సందడి నెలకొంది.
Sankranti 2025: వివిధ ప్రాంతాల్లో భోగి పండుగ సందడి ఈ వీడియోలో చూడవచ్చు..