Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషన్.. ఆల్ టైం రికార్డ్!

Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం రీజనల్ గా ఇండస్ట్రీ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలోకి కూడా వచ్చి రికార్డులు బ్రేక్ చేసింది.అయితే థియేటర్స్ లో భారీ లాంగ్ రన్ ని అందుకున్న ఈ చిత్రం తాజాగా 50 రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈరోజుల్లో ఈ చిత్రం ఏకంగా 92 సెంటర్స్ పూర్తి చేసుకోవడం విశేషం. దీనితో దర్శకుడు అనీల్ రావిపూడి ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు తెలుగు ఆడియెన్స్ కి అలాగే తన సినిమా కోసం నిలబడ్డ డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన హీరో వెంకటేష్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు సహా హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి వీరితో సంగీత దర్శకుడు భీమ్స్ కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *