Bigg Boss 9

Bigg Boss 9: బిగ్ బాస్ లో పెరుగుతున్న బాడీ షేమింగ్.. తొలి కెప్టెన్ గా సంజన

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో ఐదో రోజు ఎపిసోడ్‌ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో సాగింది. నామినేషన్స్‌లో ఇప్పటికే శ్రష్టి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మాన్యుయెల్ ఉన్న నేపథ్యంలో హౌస్‌లో రచ్చ మరింత ఆసక్తికరంగా మారింది.

తొలి కెప్టెన్‌గా సంజనా

ఈ వారం కెప్టెన్సీ రేస్‌లో చివరి వరకు పోటీ కఠినంగా సాగింది. శ్రీజ టాస్క్‌లో గెలిచినా, తాను గెలవడానికి కారణమైన సంజనను కెప్టెన్‌గా ఎంపికచేసింది. దీంతో సీజన్ 9 తొలి కెప్టెన్‌గా సంజనా గల్రానీ అధికారికంగా ప్రకటించారు. కెప్టెన్ అవ్వడంతో బిగ్ బాస్‌ ఆమెకు అభినందనలు తెలుపుతూ వారం రోజులపాటు లగ్జరీ ఫెసిలిటీస్ అందజేశాడు.

కెప్టెన్ పవర్స్ – ఆర్డర్స్ & వివాదాలు

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంజనా హౌస్‌మేట్స్‌కు ఆర్డర్స్ ఇవ్వడం ప్రారంభించింది. ఫ్లోరాను లగేజ్ తెమ్మని చెప్పగా, ఆమె మొఖం మీదనే నేను తెను అను చెప్పింది.  కెప్టెన్ గా మరీనా వెంటనే వంట చేయమని ఆర్డర్ వేయడం, స్కిట్ ప్రిపేర్ చేయమని అడగడం కూడా కంటెస్టెంట్స్‌ను ఇబ్బంది పెట్టింది. కామనర్లు సంజనకు వచ్చిన లగ్జరీ ఐటెమ్స్ (చిప్స్, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్) దొంగతనంగా లేపేయడం హౌస్ లో ఫన్నీ మూమెంట్‌గా మారింది.

ఇది కూడా చదవండి: ICC World Cup 2025: ఈ వేదికలలోనే ఉమెన్స్ వరల్డ్‌ కప్‌ 2025 మ్యాచ్‌లు..!

హౌస్‌లో గ్రూపుల రాజకీయాలు

సంజన కెప్టెన్ అవ్వడంతో హౌస్‌లో  గ్రూపులు పుట్టుకొచ్చాయి. 

  • ఇమ్మాన్యుయెల్ – భరణి ఒక గ్రూప్‌గా,
  • హరీష్ – ప్రియా – మనీష్ మరో గ్రూప్‌గా,
  • రీతూ – పవన్ కళ్యాణ్ – పవన్ (డీమన్ పవన్) వేరే వర్గంగా ఏర్పడ్డారు.

ఇదిలా ఉండగా సంజన – తనూజ క్లోజ్‌గా మాట్లాడుకోవడం, ప్రత్యర్థి టీమ్ సభ్యురాలిని కెప్టెన్‌గా చేయడంపై హరీష్ అసంతృప్తి వ్యక్తం చేయడం హైలైట్ అయ్యాయి.

బాడీ షేమింగ్ & ఫుడ్ ఫైట్స్

ఇమ్మాన్యుయెల్‌పై వస్తున్న బాడీ షేమింగ్ కామెంట్స్ అతడికి చిరాకు వేసే లాగా చేసాయి వెంటనే దాని పైన స్పందించాడు. దీనికి భరణి  సపోర్ట్ ఇచ్చాడు. మరోవైపు వంట విషయంలో సంజన తనూజకు ప్రత్యేక ఆర్డర్ ఇవ్వడంతో గొడవలు మొదలయ్యాయి. “ఇంటి లోపల ప్రతిరోజూ ఫుడ్‌ కోసం గొడవలే జరుగుతున్నాయి” అని ఇమ్మాన్యుయెల్ చెప్పడమే దీనికి ప్రూవ్.

ఫన్నీ మూమెంట్స్ – స్కిట్ & జంతువుల పోలికలు

ALSO READ  Sanjay Raut: ఈ పిరికివాళ్ళు పాకిస్తాన్ ని ఏం చేయలేరు.. కాల్పుల విరమణపై శివసేన ఆగ్రహం

కూల్‌డ్రింక్స్ అందరికి పంచేటప్పుడు “ముందు నన్ను ఇంప్రెస్ చేయాలి” కెప్టెన్ సంజన కండిషన్ పెట్టింది, అది నచ్చని హరీష్ దొంగతనానికి తెగబడటంతో  హౌస్ లో నవ్వులు పూశాయి. తర్వాత ఇమ్మాన్యుయెల్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా  హౌస్‌మేట్స్‌ని జంతువులతో పోల్చింది. రీతూ చిరుత, పవన్ కళ్యాణ్ బ్లాక్ పాంథర్, భరణి సింహం, ప్రియా ఎలుగుబంటి, శ్రష్టి నక్క, తనూజ ఉడుత, హరీష్ హైనా, శ్రీజ ఎలుక, సుమన్ శెట్టి తాబేలు, మనీష్ ఆనకొండ, ఫ్లోరా కోతి, ఇమ్మాన్యుయెల్ ఏనుగు, తాను పులి అని సమాధానంగా వచ్చింది. 

తర్వాత హౌస్‌మేట్స్ ప్రదర్శించిన ఫన్నీ స్కిట్ “బతుకు జట్కా బండి” స్టైల్లో సాగి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. భార్యాభర్తల గొడవల ఆధారంగా నడిచిన ఈ కామెడీ డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

ఫైనల్ టచ్

స్కిట్‌ ముగిసిన తర్వాత బాగా పర్ఫామ్ చేసిన వారికీ సంజనా థంబ్స్‌అప్ బాటిల్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. మొత్తానికి, ఐదో రోజు ఎపిసోడ్‌ – కెప్టెన్సీ రేసు, హౌస్ రాజకీయాలు, ఫుడ్ ఫైట్స్‌, ఫన్నీ మూమెంట్స్ అన్నీ కలిసి పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *