Sangeeth Shobhan: మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్ళీ నిర్మాతగా మానస శర్మ రూపొందిస్తున్న ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యువ కథానాయకుడు సంగీత్ శోభన్ హీరోగా నటిస్తూ సోలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో తన అద్భుత నటనతో అలరించిన సంగీత్, మూడేళ్లలో కేవలం రెండు సినిమాలే చేశారు. అయినా, ‘మ్యాడ్’ సిరీస్‌లో దామోదర్ అలియాస్ డిడి పాత్రతో జనాల్లో ఫేమ్ తెచ్చుకున్నారు. నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా తనదైన కామెడీ టైమింగ్‌తో అభిమానులను సొంతం చేసుకున్న సంగీత్, ఇప్పుడు సోలో హీరోగా అవకాశం అందిపుచ్చుకున్నారు. ఈ సినిమాకి మానస శర్మ కథ అందించగా, మహేష్ ఉప్పల స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌తో సహ రచయితగా వ్యవహరిస్తున్నారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. సంగీత్ సోలో హీరోగా ఆరంగేట్రంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

