Sangareddy:

Sangareddy: జీవితంలో ఓడిండు.. ఎన్నిక‌ల్లో గెలిచిండు!

Sangareddy: ఆ వ్య‌క్తి జీవితంలో ఓడినా, రెండో విడ‌త స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో గెలిచి, ఊరంద‌రి మ‌న‌సు గెలుచుకున్నాడు. కాన‌రాని లోకాల‌కు వెళ్లినా, ఆయ‌న‌నే ఆ ఊరు ఆద‌రించింది. త‌నకే ఊరంద‌రి ఆద‌ర‌ణ ఉన్న‌ద‌న్న విషయాన్ని గ్ర‌హించ‌లేని ఆ వ్య‌క్తి ఆ ఊరి వారంద‌రినీ వ‌దిలి వెళ్లిపోయాడు. ఒక‌వేళ ఇదే జ‌రుగుత‌ద‌ని తెలిసి ఉంటే.. ఆ వ్య‌క్తి ఊరంద‌రితో క‌లిసి న‌డిచేవాడు. కానీ, నేడు ఆ వ్య‌క్తి దూర‌మ‌వ‌డంతో ఆ కుటుంబంతోపాటు గ్రామ‌స్తులు బాధ‌ను వ్య‌క్తంచేస్తున్నారు.

Sangareddy: పంచాయ‌తీ స‌ర్పంచ్ కావాల‌న్న క‌ల‌తో అయ్య‌ప్ప మాల వేసి సీహెచ్ రాజు (36) సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండ‌లం పిప్ప‌డ్‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీకి నిల‌బ‌డ్డాడు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున నామినేష‌న్ కూడా వేశాడు. ఆ త‌ర్వాత కొన్ని ప‌రిణామాల‌తో ఆయ‌న క‌ల‌త చెందాడు. త‌న‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఊహించాడు.

Sangareddy: రాజు తోటి స్వాముల వ‌ద్ద త‌న గోడు చెప్పుకొని బాధ‌ను వ్య‌క్తంచేశారు. త‌న వ‌ద్ద ప్ర‌త్య‌ర్థి పెట్టేంత సొమ్ము లేద‌ని, త‌న‌ను నిల‌బెట్టిన నాయ‌కులే త‌న‌ను మోసం చేసి త‌న వెంట తిర‌గ‌డం లేద‌ని వారికి చెప్పుకొని మ‌ద‌న ప‌డ్డాడ‌ని తోటి స్వాములు చెప్పారు. ఇక తాను బ‌త‌క‌డం అన‌వ‌స‌రం అనుకునే వాడ‌ని వారు చెప్పారు. దీంతో ఆయ‌న ఆల‌య స‌మీపంలోనే ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

Sangareddy: ఈ ఘ‌ట‌న అనంత‌రం నిన్న జ‌రిగిన రెండో విడ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌మీప ప్ర‌త్య‌ర్థిపై 9 ఓట్ల మెజారిటీతో సీహెచ్ రాజు విజ‌యం సాధించాడు. అత్య‌ధిక మంది రాజు వైపే నిలిచారు. మ‌రి ఇప్పుడు ఆ రాజు లోకంలో లేక‌పోవ‌డంపై ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. కొంద‌రు త‌న నుంచి దూర‌మైనా, ఊరంతా త‌న‌కే మ‌ద్ద‌తు ఉన్న విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోయాడు రాజు. గ్రహించి ఉంటూ ఆయ‌న ఊరికి ఉప‌కారం చేస్తూ నలుగురిలో తాను ఒక‌డిగా ద‌ర్జాగా బ‌తుకుతూ స‌ర్పంచ్ రాజు అనిపించుకునేవాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *