Sangareddy: అతడి కూతురిని ప్రేమించాడు.నా కూతురిని నువ్వు ప్రేమించడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. మళ్లీ మళ్లీ ఆ అమ్మాయి వెంట పడ్డాడు. ఎన్ని సార్లు చెప్పాలి అని చెప్పాడు. కానీ మారలేదు. ఎందుకో అతడిపై నమ్మకం లేని ఆ తండ్రి , తన కూతురిని ప్రేమించే వాడిని ..ఈ భూమి మీదనే లేకుండా చేయాలి అనుకున్నాడు. పిలిచాడు , మాట్లాడాడు, చంపేశాడు, కాల్చేశాడు. చివరకు దొరికిపోయాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్ పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. దీంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తిని హత్య చేశాడు.
Also Read: Crime News: విషాదం, ఎలుకల కోసం టమోటాల్లో మందు కలిపిన భర్త .. చట్నీ చేసుకుని తిన్న భార్య మృతి
నిజాంపేట మండల శివారు అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.. అయితే.. దశరథ్‌ను చంపిన అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
మరోవైపు.. దశరథ్ కోసం కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వ్యక్తి మృతదేహం కోసం రోడ్డుపై బైఠాయించారు. కాగా.. దశరథ్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుడు దశరథ్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.