Sandeep Reddy Vanga: సందీప్ వంగ.. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్టర్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.. ఈ మూడు సినిమాలతోనే డైరెక్టర్‌గా తన రేంజ్‌ను నిరూపించాడు. ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం మరో సంచలనం కాబోతోంది. సందీప్ రాడార్‌లో మహేష్ బాబు, చరణ్ లాంటి స్టార్లు ఉన్నారు. అయితే మహేష్ తో మాత్రం సినిమా పక్కా అని సమాచారం. అలాగే మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా, సందీప్ చిరుతో సినిమా చేసే ఛాన్స్ కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే, బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయం!మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.
