Spirit: డార్లింగ్ ప్రభాస్ సినిమాల లైన్‌ప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే మారుతితో చేస్తున్న ‘రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అంటూ వరుసగా బిగ్ బడ్జెట్ మూవీస్ వరుసగా మూవీస్ చేస్తున్నాడు.
ఈ చిత్రాల అనంతరం నాగ్ అశ్విన్‌తో కల్కి 2, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2, అలాగే క్రేజీ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మరో కొత్త సినిమా చేయనున్నారు. అయితే ఈ లైన్‌ప్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది స్పిరిట్ మూవీ.
స్పిరిట్ – పోలీస్ గెటప్‌లో ప్రభాస్.. డైరెక్టర్ డ్రీమ్ కాస్టింగ్‌లో ట్విస్టు
సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని పూర్తిగా మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా డిజైన్ చేస్తున్నారని టాక్. ఇందులో ప్రభాస్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక విషయంలో చిన్నపాటి గొడవే జరుగుతోందట!
సందీప్ మొదటిగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొణేను హీరోయిన్ గా తీసుకోవాలని భావించాడు. కానీ దీపిక పెట్టిన షరతులు నిర్మాతల కళ్లకి నీళ్లు తెప్పించాయట. ఆమె ఒకవైపు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడమే కాకుండా, రెవెన్యూ షేర్ కూడా అడిగిందట. అంతేకాదు, రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని స్పష్టంగా చెప్పిందట. అందులోనూ 2 గంటలు ట్రావెల్‌కి వెళ్తే సెట్స్‌లో గడిచే సమయం నాలుగు నుంచి ఆరే గంటల వరకే పరిమితం అవుతుందట!
ఇది కూడా చదవండి: PM Modi: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
దీపిక ఔట్? అనుష్క ఇన్?
దీపిక చేసిన డిమాండ్లతో సందీప్ వంగా తీవ్రంగా నిరాశచెందినట్టు ఫిల్మ్ నగర్ టాక్. “ఇలాంటి ప్రాజెక్ట్‌కి డెడ్డికేషన్ ఉన్న నటీమణి కావాలి.. టైమ్ కండిషన్స్‌తో వచ్చే వారిని ఓపిక పట్టలేం” అనే స్థాయిలో మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త హీరోయిన్ వెతికే పనిలో సందీప్ బిజీగా ఉన్నట్టు సమాచారం.
ఇంతలో తాజా బజ్ ఏంటంటే.. దీపిక స్థానంలో ప్రభాస్‌కు జోడీగా అనుష్క శెట్టిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచనలో ఉన్నారట! ‘బాహుబలి’ కాంబో మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతారన్నది నిర్మాతల లెక్క.
ఫైనల్‌గా…
ప్రభాస్ – సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చే స్పిరిట్ మూవీ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా కథ, ప్రెజెంటేషన్, హీరో గెటప్ అన్నీ విభిన్నంగా ఉండబోతున్నాయి. కానీ కథను కన్నా కాస్టింగ్ చుట్టూ తిరిగే డ్రామానే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీపిక డిమాండ్ల వలన సినిమా రంగంలోకి మరో సంచలనం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక అంతిమంగా.. ‘స్పిరిట్’కి హీరోయిన్ ఎవరు?’ అనే క్లైమాక్స్‌కి ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ రానుందట. అంతవరకూ ఈ కథనంలో ట్విస్ట్‌లే ప్రేక్షకుల ఊహాగానాలకు చెక్కుచెదరని మసాలా అవుతాయ్!