Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: స్పిరిట్ లో చిరంజీవి,డాన్ లీ.. క్లారిటీ ఇచ్చిన వంగా

Sandeep Reddy Vanga: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న హై-వోల్టేజ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ గురించి సినీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకపోయినా, ఈ చిత్రంపై రోజుకో కొత్త ప్రచారం జరుగుతూ సినిమాపై క్రేజ్ పెంచుతుంది. 

తాజాగా, సందీప్ రెడ్డి వంగా తాను ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేసిన కి సపోర్ట్ చేస్తూ ‘జిగ్రీస్’ అనే చిన్న సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన వార్తలపై స్పందించారు.

చిరంజీవిపై వంగా క్లారిటీ

కొంతకాలంగా ‘స్పిరిట్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్పందించిన సందీప్ రెడ్డి వం. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు, చిరంజీవి తో సినిమా చేస్తే అతని ఒక్కరినే పెట్టి తీస్తాను అన్నారు. దీంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.

ఆ కొరియన్ స్టార్‌పై హింట్!

అయితే, ఈ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ‘స్పిరిట్’ సినిమాలో కొరియన్ నటుడు డాన్ లీ (Don Lee) నటిస్తున్నారా అని ప్రశ్నించగా, సందీప్ వంగా దాన్ని ఖండించకుండా మౌనం వహించారు. “ఇస్తా, ఒక అప్‌డేట్ ఇస్తా” అంటూ ఆయన కామెంట్ చేయడం గమనార్హం.

సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ఈ హింట్‌ను బట్టి చూస్తే, ‘స్పిరిట్’ సినిమాలో డాన్ లీ నటించే అవకాశం దాదాపు ఖాయం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: China Rubber Dumping: చైనా రబ్బర్ డంపింగ్ పై అంబానీ కంపెనీ ఫిర్యాదు.. మ్యాటర్‌ ఏంటంటే..?

డాన్ లీ (మా డాంగ్-సియోక్) కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజీ ఫాలోయింగ్ ఉన్న నటుడు. మార్వెల్ సినిమా  ‘ఎటర్నల్స్’లో కూడా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒకవేళ డాన్ లీ ఈ సినిమాలో నటిస్తే, ప్రభాస్ క్రేజ్‌కు తోడు కొరియన్ స్టార్ ఫాలోయింగ్ కూడా జత అవుతుంది. దీంతో ‘స్పిరిట్’ సినిమా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌తో భారీ స్థాయిలో విడుదల కావడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. మరి సందీప్ వంగా ఎప్పుడు దీనిపై అధికారిక అప్‌డేట్ ఇస్తారో చూడాలి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *