Hyderabad: ఎస్బిఐ బ్యాంకు నిట్ట నిలువునా ముంచాడు ఓ మాజీ మేనేజర్. మరణించిన వారు అకౌంట్లో లోని డబ్బులను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా తానే క్లైమ్ చేసుకుంటూ కోట్ల రూపాయల ఫ్రాడ్ కి తెర లేపాడు. వివరాల్లోకెళ్తే సనత్ నగర్ ఎస్బీఐ బ్రాంచ్ లో మేనేజర్ గాపనిచేసిన కార్తీక్ రాయ్.. మరణించిన వారి అకౌంట్లలోని డబ్బును వారి కుటుంబసభ్యులకు చెప్పకుండా క్లెయిమ్ చేశాడు. పలువురు కస్టమర్ల ఫిక్సిడ్ డిపాజిట్ల మొత్తాన్ని తనకు సంబంధించిన వ్యక్తుల అకౌంట్లకు మళ్లించాడు.
మ్యూచువల్ ఫండ్స్, నకిలీ జీతాల పత్రాలు సృష్టించి బ్యాంకు లోన్లు తీసుకొని ఆ నిధులను కూడా దారి మళ్లించాడు. బ్యాంక్లో లోన్లు తీసుకొని క్లోజ్ చేసిన అకౌంట్లపై కొత్త లోన్లను తీసుకున్నాడు. ఈ నిధుల్లో రూ.1.02 కోట్లను తన భార్య అకౌంట్లలోకి మళ్లించాడు. అలాగే మట్టెపల్లి శ్రీశాంత్, విశాల్కు ఫేక్ డాక్యుమెంట్లతో రూ. 15 లక్షలు లోన్ ఇప్పించారు. ఇందుకు రాజు అనే వ్యక్తి లోన్ ఏజెంట్గా ఉండగా, వీరికి సుధాన్సు శేఖర్ జిరాక్స్ షాపునకు చెందిన ఉపేందర్ ఫేక్ డాక్యుమెంట్లు, సాలరీ స్లిప్పులు క్రియేట్ చేశారు.
ఎండీ వాజీద్, సునీల్ కుమార్ అనే మరో ఇద్దరు లోన్ ప్రాసెస్ను చూశారు.కార్తీక్ రాయ్బదిలీఅయిన తర్వాత కొత్తగా వచ్చిన మేనేజర్ రామచంద్ర రాఘవేంద్ర ప్రసాద్ఈ ఫ్రాడ్ను గుర్తించి సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన ఈఓడబ్ల్యూ పోలీసులు ఫ్రాడ్తో సంబంధం ఉన్న శ్రీశాంత్, విశాల్, రాజు, శేఖర్, వాజీద్, సునీత్కుమార్, భాస్కర్, ఉపేందర్ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరికొంత మందిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు.