Samyuktha Menon

Samyuktha Menon: స్టార్ హీరో కి జోడీగా సంయుక్త..

Samyuktha Menon: తెలుగు తెరకు ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటి నుంచి బింబిసార, సార్, విరూపాక్ష వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ పెద్ద సినిమాల్లో అవకాశాలు మాత్రం తగ్గిపోయాయి.

ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభు’ అనే సినిమాలో నటిస్తున్న సంయుక్త.. ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ కొట్టేసింది. అది కూడా ఎవరిదెరుగుతారా? మెగాస్టార్ చిరంజీవి సినిమాతో!

చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’, మరొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా. విశ్వంభర షూటింగ్ పూర్తై, ఇప్పుడు గ్రాఫిక్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. దానికి ఏకంగా రూ.75 కోట్ల బడ్జెట్ వీఎఫ్ఎక్స్‌కే ఖర్చు పెడుతున్నారట! ఇది సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ కేరళలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చిరు 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ పరిగణలోకి తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: PM Kisan: నేడు పీఎం కిసాన్‌ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు

ఇవి పూర్తయ్యాక.. చిరు డైరెక్టర్ బాబీతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. మొదట మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు వార్తలొచ్చినా.. తాజాగా ఈ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ కు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా మెచ్చుకోలేదుగానీ.. అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.

ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించనుందట! చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కడం అనేది ఎవరికైనా కెరీర్‌కి మలుపు తిప్పే అవకాశం. ఇదే మాట సంయుక్తకీ వర్తిస్తుంది. భీమ్లా నాయక్ తర్వాత అఖండ 2, డెవిల్ లాంటి చిత్రాల్లో నటిస్తున్న సంయుక్త.. చిరు సినిమాలో అవకాశం రావడంతో మరింత హైప్‌కు చేరినట్టే.

ఈ మధ్య బాలకృష్ణతో కలిసి ఓ జ్యువెల్లరీ యాడ్‌లో కనిపించిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఫిల్మ్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది అంటే.. నిజంగా ఈ అమ్మడికి పంటలు పండినట్టే!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *